మురిపించిన మనసు (Telugu Song Lyrics)
మురిపించిన మనసు
ఏ దారిలోనో నీ దారిలోనో
పయనించు వేళ
నా ఊహలో మురిపించే మనసు
నా బ్రాంతిలోనా
కలతలే కాదు మమతలే కాదు
కలవరింత నీకోసమే
విధివ్రాతయై, అది నాకు భారమైనది
ఏనాటిదో, మమత ఏనాటి ప్రేమ ఇది// ఏ దారిలోనో
నా మనసే ఇలా విశాల సూన్యంలో
విహరించే మనసు - ఆకాశ వీధిలో
ఏనాటి రుణమో - అలనాటి ప్రేరణో
తెలియరాకున్నది ఈ నాటి వేళలో //ఏ దారిలోనో
మనసులోని మాటలే ముడుపు కట్టానిలా
వేచి చూసేను నేను, నీ కోసమే ప్రియా
ఎడడుగుల బంధమై, మన ప్రేమ పవిత్రమై
ప్రేమాభిషేకమై నీకంకితమై, నే వేచియున్నా// ఏ దారిలోనో
========
Mantri Pragada Markandeyulu, Litt.D.,
Story and Songwriter/Lyricist
Plot No. 37, Anupuram, ECIL Post,
Hyderabad-500062 (Telangana State) Bharat (India)
Mobile No: +91-9951038802
Email: mrkndyl@gmail.com
You may also like…