నీలిమేఘంలో - చందమామ పాట (Telugu Song Lyrics - Copyright)
నీలిమేఘంలో - చందమామ పాట
నీలిమేఘంలో దాక్కుని ఉన్న మామ
అందమైన వెలుగును ఇచ్చే ఆ చందమామ ....
దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నట్టే
వెండివెన్నెల వెలుగులు పంచె అందమైన చందమామ // నీలిమేఘంలో //
అద్దంలోనా కనిపిస్తాడు
ఆరుబయటా మురిపిస్తాడు
చెవుల పిల్లిని చూపిస్తాడు
నిండుపున్నమిని అందిస్తాడు // నీలిమేఘంలో //
మబ్బుల్లో దోబూచులాడుతూ
చల్లని వెన్నెల చంద్రకాంతితో
నెలవంకలా అగుపడుతాడు
పూర్ణబింబంగా ఆనందాన్ని పంచుతాడు
ఆ చందమామా - అదిగో చందమామ // నీలిమేఘంలో //
కొండల్లోనా - కొనల్లోనా
అడవుల్లోనా - లోయల్లోనా
నదులల్లోనా - సాగరంలోనా
మనవెంటే - మననీడల్లే
ఆ చందమామా - అదిగో చందమామ // నీలిమేఘంలో //
మనఅందరినీ మురిపించేదీ
అందుకొమ్మనీ అలరించేదీ
మన మనసులకు హాయిని గొలిపే
మనమామే చందమామ
అదిగో చందమామ....
ఆ చందమామ // నీలిమేఘంలో //
======
Mantri Pragada Markandeyuu, D.Litt.,
Story and Song Writer/Lyricist
Email: mrkndyl@gmail.com
+91-9951038802
Hyderabad, Telangana State, India
You may also like…